కూటమిలో వారికి ప్రిఫరెన్సే లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

by Rajesh |
కూటమిలో వారికి ప్రిఫరెన్సే లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. కూటమిలో చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారన్ని పేర్కొన్నారు.

ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారన్నారు. అధికారులను చంద్రబాబు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తోందన్నారు. చంద్రబాబు పిల్ల చేష్టలు చేస్తున్నారని.. సీఎంను నోటికొచ్చినట్లు తిడుతున్నారన్నారు. వ్యవస్థలపై చంద్రబాబుకు గౌరవమే లేదన్నారు. వృద్ధులకు టైమ్‌కి పెన్షన్లు అందకుండా చంద్రబాబు పాపానికి పాల్పడ్డారని తెలిపారు. వాలంటీర్లపై కక్షతోనే చంద్రబాబు అలా చేశారన్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసిన 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామన్నారు. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed