- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లేనట్టే..!
- కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా?. డిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా?. డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా?.' అనే అంశాలపై రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని వెల్లడించారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్పష్టం చేశారు.