- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీతో పొత్తుపై గందరగోళం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పొత్తులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అటు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు బీజేపీ అధిష్టానం కూడా స్పందించలేదు. అయితే జనసేన రెండు వైపులా ఉండటంతో గందరగోళం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్కడ సమావేశం పెట్టినా.. మీడియాతో మాట్లాడినా టీడీపీతో పొత్తు అంశంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
దీంతో పొత్తులపై పురంధేశ్వరి స్పష్టత ఇచ్చారు. ఏలూరులో పర్యటిస్తున్న ఆమె ఇప్పటికైతే జనసేనతోనే తమ పొత్తు అని పేర్కొన్నారు. మిగిలిన పార్టీలతో పొత్తు అంశం బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అది కూడా ఎన్నికలకు ఒక నెల ముందు మాత్రమే పొత్తుల ప్రస్తావన ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఎవరితోనూ ఎలాంటి పొత్తులు లేవని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పొత్తులకు సంబంధించి బీజేపీ కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నివేదికను బీజేపీ అధిష్టానానికి పంపుతామని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి పేర్కొన్నారు.