- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: AP అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సభలోనే TDP ఎమ్మెల్యేపై దాడి!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జీవో నెంబర్ 1ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుర్చీ నుండి లేచి లోపలికి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అధికార పార్టీ నేతలు స్పీకర్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ క్రమంలో టీడీపీ, అధికార వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేతల పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీ రణరంగంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అసెంబ్లీలోనే బాహాబాహికి దిగినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే డోలాపై వైపీసీ ఎమ్మెల్యే దాడి చేసినట్లు సమాచారం. ఇక ఇరుపక్షాల నేతల ఆందోళనతో సభ గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో టీడీపీ సభ్యులు అసెంబ్లీ వెల్‌లో కూర్చొని నిరసన చేపట్టారు.
ఎవరి గోల వారిదే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్న వైసీపీ