Winter:సీజన్ వ్యాపారం షురూ.. స్వెటర్లకు భారీ డిమాండ్

by Jakkula Mamatha |
Winter:సీజన్ వ్యాపారం షురూ.. స్వెటర్లకు భారీ డిమాండ్
X

దిశ, కారంపూడి: ప్రస్తుతం వర్షాలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. శీతాకాలంలో ఉన్ని వస్త్రాలకు గిరాకీ పెరుగుతుంది. చలి నుంచి ఉపశమనం పొందడానికి ఈ వస్త్రాలు బాగా ఉపకరిస్తాయి. దీంతో ప్రతి ఒక్కరూ వీటి కొనుగోలు కోసం ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రతి ఏటా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ గత పది సంవత్సరాలుగా నుంచి చిరు వ్యాపారి కారంపూడి పట్టణానికి వచ్చి నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉన్ని వస్త్రాలు విక్రయిస్తారు. పట్టణంలోని మాచర్ల రోడ్డు నందు ఉన్ని వస్త్రాల దుకాణాలు ఏర్పాటు చేసి వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు. ఉత్తరప్రదేశ్‌లో తయారైన ఉన్ని వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడే పుట్టిన చంటి బిడ్డకు సరిపడే వస్త్రం నుంచి అన్ని వయస్సుల వారికి, స్త్రీలు, పురుషులు అందరికీ సరిపడా ఉన్ని వస్త్రాలు వీరి దగ్గర లభిస్తాయి. అలాగే వర్షాకాలంలో ఉపయోగించే రెయిన్ కోట్ కూడా వీరు విక్రయిస్తున్నారు. శీతాకాలంలో మంచులో తిరిగితే జలుబు, ఇతర రుగ్మతలకు గురవుతారు. వాటికి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులు ఉపయోగ పడతాయి. చలి తీవ్రత ఇప్పుడు ఇప్పుడే పెరగడం వలన బుధవారం నాడు దుస్తులు కొనుగోలు చేయడానికి పట్టణ స్వాములు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed