- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రోడ్డు దుస్థితి మారేదెన్నడో..
దిశ, ఇంద్రవెల్లి : మండల కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న వడగావ్ గుండా ప్రయాణించి రోడ్డు దుస్థితి మారేది ఎన్నడో.. ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో వేసిన నాసిరకమైన బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కాగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ రోడ్డును పట్టించుకునే నాథుడు కరువయ్యారని ప్రయాణికులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత పదేళ్ల నుంచి రోడ్డు దుస్థితి అలాగే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన రొడ్డును పట్టించుకొనే నాథుడు కనిపించడం లేదని అంటున్నారు.
ఈ రోడ్డు మార్గం ద్వారా అంజి, మామిడి గూడ, జైత్ర తండా, వాడగాం, పాటగూడ, బండా పాటగూడ, మొడిగూడ, పాలుండి గుడా, వాల్గొండా, హిరపూర్, పొల్లుగుడా, లింగపూర్, హిరపూర్, లాల్ టే కిడి, ఇలా దాదాపు 15 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డును చూసి ఆందోళన చెందుతున్నారు. వానలు కురిస్తే ఇక అంతే సంగతులు, ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలంటేనే భయపడుతున్నారని తెలియజేస్తున్నారు. భారీగా గుంతలు ఏర్పడటంతో మండల కేంద్రానికి చేరుకోవాలంటే నరకం అనుభవాల్సిందేనని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. రోడ్డు మరమ్మతులను సంబంధించిన శాఖ అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చొరవ తీసుకొని రాకపోకలకు కొనసాగించేందుకు తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.