- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
దిశ, ఎఫెక్ట్.. గ్రామ పంచాయతీకి చేరిన మంచినీటి పైపులు...
దిశ, రామడుగు : రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో మంచినీటి పైపులు గ్రామపంచాయతీ నుండి ఆటోలో తరలించిన వైనం పై గురువారం దిశ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తరలించిన పైపులను గ్రామపంచాయతీ కార్యాలయానికి తెప్పించడం గమనార్హం. కాగా పంప్ ఆపరేటర్ దాసరి రాజయ్యను మాత్రం విధుల్లోకి తీసుకోకపోవడం గమనార్హం. పైపులు తరలించిన విషయమై రాజయ్యను గ్రామ కార్యదర్శి తొలగించాడని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. రాజయ్య ఇచ్చిన సమాచారం మేరకే అధికారులు తరలించిన పైపులను వెతికి గ్రామపంచాయతీకి తెప్పించడం కొసమెరుపు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే పైపులను తెచ్చినప్పటికీనీ విధులకు మాత్రం రాజయ్యను మళ్లీ తీసుకుంటారా అనేది సందిగ్ధంగా మిగిలింది.
నా వృత్తికి న్యాయం చేశా.. పంప్ ఆపరేటర్ రాజయ్య..
గ్రామపంచాయతీలోని పైపులు ఓ వ్యక్తి తీసుకువెళ్లిన దాని పై తన కర్తవ్యంగా భావిస్తూ గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. దీంతో వెంటనే తీసుకువెళ్లిన పైపులు యధావిధిగా గ్రామ పంచాయతీకి చేరాయి. తన ఉద్యోగరీత్యా తాను పనిచేయడం సంతృప్తిగా ఉందన్నారు. కానీ తన ఉద్యోగం పై ఇంకా కార్యదర్శి ఎలాంటి స్పందన ఇవ్వలేదని రాజయ్య తెలిపారు.