‘ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు లేరు’.. అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన మంత్రి

by Jakkula Mamatha |
‘ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు లేరు’.. అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని వాలంటీర్లకు బిగ్ షాక్ తగిలింది. గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి(Dola Bala Veeranjaneya Swamy) అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు(సోమవారం) వాలంటీర్ల తొలగింపు పై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి డోలా మాట్లాడుతూ.. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని స్పష్టం చేశారు. వారిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు.

ఆగస్టు తర్వాత వాలంటీర్ల(Volunteers) పదవి పొడిగింపునకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని మంత్రి తేల్చి చెప్పారు. ఈ తరుణంలో తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసే వాళ్లమని వివరించారు. ఈ క్రమంలో ప్రజెంట్ వాలంటీర్లు ఎవరు లేరని.. రెన్యువల్ చేయలేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండలిలో కుండబద్దలు కొట్టేశారు.

ఇదిలా ఉంటే.. భారీ ధర్నాకు వాలంటీర్లు(Volunteers) సిద్ధమయ్యారు. CITU ఆధ్వ‌ర్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున విజయవాడ(Vijayawada)కు చేరుకున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ వాలంటీర్లు డిమాండ్ చేశారు.

Advertisement
Next Story

Most Viewed