పులివెందులలో జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం.. ప్రచారాన్ని ఖండించిన వైసీపీ

by srinivas |
పులివెందులలో జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం.. ప్రచారాన్ని ఖండించిన వైసీపీ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ఇంటి వద్ద హడావుడి నెలకొంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగన్ కలిసేందుకు ఇంట్లోకి మూకుమ్మడిగా వెళ్లారు. అయితే జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందని, వైసీపీ శ్రేణులు తిరుగుబాటు చేశారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ ఘటనలో జగన్ ఇంటి కిటికీ అంద్దాలు ధ్వంసం అయ్యాయని సోషల్ మీడియాలో కొంతమంది ట్వీట్ చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. జగన్ నివాసం వద్ద వైసీపీ శ్రేణులు తిరుగుబాటు చేశారనే వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తు్న్నారని మండిపడింది. తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు మానిసిక రుగ్మతలతో బాధపడుతున్నారని.. వారందరిని ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖండించింది.

Advertisement

Next Story

Most Viewed