సీఎం జగన్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన యువకుడు

by Disha Web Desk 18 |
సీఎం జగన్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన యువకుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ పులివెందులలో గురువారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. సీఎం పులివెందుల పర్యటన అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ అనంతరం అక్కడే సీఎస్‌ఐ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహీరంగ సభలో పాల్గొన్నారు. సభలో వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పులివెందుల పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సీఎం జగన్‌పై రాళ్లతో దాడి జరిగి గాయపడిన సంగతి తెలిసిందే. నామినేషన్‌కి వెళ్లి వస్తుండగా ఆయన కాన్వాయ్‌కి ఎదురుగా ఓ యువకుడు పరుగెత్తుకు వచ్చాడు. ‘జై జగన్’ అంటూ ఆ యువకుడు కారు వైపు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అడ్డుకున్నారు.



Next Story

Most Viewed