- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో ఆ సీటా.. మాకొద్దు మహా ప్రభో..!
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ ఎంపీ సీటు విషయంలో అధిష్టానం అడుగులు ముందుకు వేయలేకపోతోంది. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈసారి లోక్ సభ అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడుతోంది. సిట్టింగ్ ఎంపీని అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకుంది. కానీ ఎంపీ విషయం కొలక్కి రావడం లేదు. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు నేతలెవరూ ముందుకు రావడం రావడంలేదు. ఎంపీగా పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయిన నేతను ఈసారి రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే అందుకు ఆయన నిరాకరిస్తున్నారు. దీంతో మరోనేతపై అధిష్టానం కన్నేసింది.
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేయించిన ఆయన కొన్ని చోట్ల వైసీపీ ఇంచార్జులను మర్చే ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకూ మూడు జాబితాలను విడుదల చేశారు. మరో లిస్టు రిలీజ్ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థి విషయం మాత్రం కొలిక్కిరావడం లేదు. అక్కడ నుంచి పోటీ చేయించేందుకు చలమలశెట్టి సునీల్ పేరును పరిశీలించారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించారు. అయితే అందుకు ససేమీరా అంటున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన మూడుసార్లు బరిలోకి దిగారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. పైగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు అస్సలు ఆసక్తిచూపటం లేదు.
దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోనేత పేరు పరిశీలిస్తున్నారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ప్రపోజల్ పెట్టారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం ఇంచార్జి నియమించారు. జెట్ స్పీడ్‌తో అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసిన వైసీపీ అధిష్టానం.. కాకినాడ ఎంపీ సీటు విషయంలో తర్జన భర్జన పడుతోంది. మరి సీఎం జగన్ నిర్ణాయానికి కట్టుబడి పెండెం దొరబాబు కాకినాడ ఎంపీలో బరిలో దిగారా.. లేదా వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.