విడుదలైన వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా .. మార్పులు చేర్పులు ఇవే

by Indraja |   ( Updated:2024-01-12 05:23:32.0  )
విడుదలైన వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా .. మార్పులు చేర్పులు ఇవే
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తూ ఇన్చార్జీలను మారుస్తున్న విషయం అందరికీ సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన జగన్ తాజాగా అభ్యర్థుల ఎంపిక విషయంలో మూడో జాబితా కూడా విడుదల చేశారు. ఇక విడుదలైన మూడో జాబితాలో మొత్తం 21 మంది ఉన్నారు. కాగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం 6 ఎంపీ స్థానాలకు 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. అయితే నిన్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డితో కేసినేని నాని భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నానికి విజయవాడ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇంకా కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు అయినా కేసినేని నానిని విజయవాడ అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం.

ఇక జిల్లాల విషయానికొస్తే శ్రీకాకుళంజిల్లా జెడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మని నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, కడప జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యేగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేడ వెంకట మల్లికార్జున రెడ్డి విధులు నిర్వహిస్తుండగా ఆయనను పక్కనపెట్టి ఈ టికెట్ ను ఆకేపాటి అమర్నాథ్ కి ఇవ్వడం గమనార్హం. ఇక ఏలూరు లోక్‌సభ వైసీసీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ ను ప్రకటించింది వైసీపీ.

అలానే కర్నూలు జిల్లాలో మూడు స్థానాల్లో మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరిని కర్నూలూ ఎంపీ అభ్యర్థిగా నియమించగా.. ఆలూరు ఎమ్మెల్యేగా చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షిని నియమించింది. ఇక ప్రస్తుతం కోడుమూరు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సుధాకర్ ను పక్కన పెట్టిన అధిష్టానం.. కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను ప్రకటించింది. టెక్కలి సీటును దువ్వాడ శ్రీనివాస్ కి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ నియమితులయ్యారు. ఇక ఈసారి పార్లమెంటు(కర్నూలు) నియోజకవర్గ ఇంఛార్జిగా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను నియమించగా.. విశాఖ పార్లమెంటు ఇంఛార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని ప్రకటించారు. అలానే తిరుపతి ఎంపీ స్థానం ఇంఛార్జిగా కోనేటి ఆదిమూలం నియమితులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed