- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:కేంద్ర మంత్రికి థాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ.. కారణం ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీకి కేంద్ర ప్రభుత్వం(Central Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)తో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు(బుధవారం) భేటీ అయ్యారు. CRIF పథకం కింద రాష్ట్రంలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి(road development) రూ. 400 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ - జాతీయ రహదారి (NH-16)కి ఇరువైపులా కుప్పగంజి వాగు నుంచి ఓగేరు వాగు వరకు (సుమారు 8 కి.మీ) అవుట్‌ఫాల్ డ్రైన్‌ల నిర్మాణం కోసం ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని ఎంపీ లావు కృష్ణదేవరాయలు కోరారు. ఈ అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
పల్నాడుకు మరో మహా రోడ్డు..
కొండమోడు - పేరేచర్ల జాతీయ రహదారికి రూ. 881.61 కోట్లు కేంద్ర ప్రభుత్వం(Central Govt) మంజూరు చేసింది. 49.917 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ జాతీయ రహదారి 4 లైన్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ జాతీయ రహదారికి అనుబంధంగా సత్తెనపల్లి, మేదికొందూరుల వద్ద రెండు బైపాస్ రోడ్లు నిర్మించనున్నట్లు టీడీపీ ఎంపీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక పేర్కొన్నారు.