- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీఎస్ ఆర్టీసీకి బోర్డు ఏర్పాటు.. చైర్మన్‌గా కీలక వ్యక్తి

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ, ఆర్థిక రవాణా, సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది. చైర్మన్‌గా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ(Former MP Konakalla Narayana)ను నియమించింది. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసింది. ఇక ఈ బోర్డులో ఆరుగురు నామినేషనేటెడ్ సభ్యులతో పాటు 11 మంది ఆర్టీసీ అధికారులు సేవలు అందించనున్నారు. బోర్డులో కేంద్రప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహించేలా బోర్డును ఏర్పాటు చేసింది. ఆర్టీసీ వ్యవహారాలను ఈ బోర్డు రెండేళ్ల పాటు పర్యవేక్షించనుంది.
కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థవంతమైన సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ సంస్థల్లో ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా పలు మార్పులు చేసింది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీపై ఫోకస్ పెట్టింది. నూతన బోర్డును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురు కీలక నేతలను సభ్యులుగా నియమించింది. అయితే ఫ్రీ బస్ జర్నీపై ఈ బోర్డు చర్చించి త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.