హైకోర్టులో దక్కని ఊరట... సుప్రీంకోర్టుకు చంద్రబాబు

by Seetharam |
హైకోర్టులో దక్కని ఊరట... సుప్రీంకోర్టుకు చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసారని పేర్కొంటూ సీఐడీ నమోదు చేసిన అభియోగాలను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది. అయితే హైకోర్టు న్యాయమూర్తి క్వాష్ పిటిషన్‌ డిస్మిస్డ్ అంటూ ఏక వ్యాఖ్యంతో తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించని నేపథ్యంలో న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో జడ్జిమెంట్ కాపీలను పరిశీలించి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు రెండు రోజులు పొడిగించింది. మరోవైపు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తాజాగా కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే మంచిదనే అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed