- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ కక్షా రాజకీయాలను కాలగర్భంలో కలిపేసే రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. ‘స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ ఈ రోజు చేపట్టే ప్రతి చర్యకు కాలం ప్రతీకారం తీర్చుకుంటుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజు ‘బాబుతో నేను’ పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో నీతి నిజాయితీతో గడిపిన చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం జగన్ అరాచక పాలనకు నిదర్శమన్నారు. జగన్ కుట్రలన్నింటినీ చంద్రబాబు చేధించుకుంటూ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’ అని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూలు నిర్వహించారు. బుక్కపట్నం చౌడేశ్వరి అమ్మవారికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పొర్లు డండాలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన తెలుగు మహిళ నేతలు తలపై పొంగళ్లు పెట్టుకుని వెళ్లి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో, పేరాల శివాలయంలో, కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని శివాలయంలో పూజలు చేశారు. పలాస నియోజకవర్గంలో మహిళలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తిరుపతిలోని పాలిటెక్నిక్ కాలేజీలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఇన్‌ఛార్జి సుగుణమ్మ సందర్శించారు.
మంగళగిరి టీడీపీ నాయకులు కేఎల్‌యూ యూనివర్సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించారు. గూడూరు నియోజకవర్గం ఆదిశంకర కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఇన్చార్జి సునీల్ కుమార్ పరిశీలించారు. గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్దులు ర్యాలీ చేపట్టారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాగడాల ర్యాలీ చేపట్టారు.