Deputy CM Pawan:‘గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేదు’.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |
Deputy CM Pawan:‘గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేదు’.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ(గురువారం) జరిగిన అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విశాఖ కాలుష్యం పై మాట్లాడారు. ఈ క్రమంలో విశాఖలో కాలుష్య తీవ్రత పెరుగుతోందన్నారు. ఈ తరుణంలో గత వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈనేపథ్యంలో గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

విశాఖలో కాలుష్య నివారణ(Prevention of pollution in Visakhapatnam) పై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని వ్యాఖ్యానించారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేదని.. ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతోందని.. దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గరైందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. కాలుష్యం కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అని చెప్పారు. కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed