AP News: ఆ జిల్లాలో బంగారం పట్టివేత.. మహిళ అరెస్ట్..

by Indraja |
AP News: ఆ జిల్లాలో బంగారం పట్టివేత.. మహిళ అరెస్ట్..
X

దిశ వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు జరిపారు. కాగా ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి అక్రమంగా బంగారాన్ని చెన్నై నుండి నల్గొండ జిల్లాకు తరలించేందుకు యత్నించింది.

అయితే తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడన్నట్టు, గుట్టుచప్పుడుకాకుండా బంగారాన్ని బార్డర్ దాటించాలని యత్ని్ంచిన మహిళ గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అలానే అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న మహిళతోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed