- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాణిపాకం హుండీ లెక్కింపులో చోరీ.. బ్యాంకు అప్రైజర్ అరెస్ట్
X
దిశ, వెబ్ డెస్క్: కాణిపాకం హుండీ లెక్కింపులో బ్యాంకు అప్రైజర్ చేతివాటం ప్రదర్శించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారం బిస్కెట్‌ను చోరీ చేశారు. అయితే ఈ తతాంగాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా ఆలయ ఈవో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో బ్యాంకు అప్రైజర్‌పై కేసు నమోదు చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి కొద్ది రోజులుగా భక్తులు సమర్పించిన నగదును, కానుకలను గురువారం ఆలయ ఆస్థాన మండపంలో లెక్కించారు. అయితే ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న అప్రైజర్ ప్రకాశ్ 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను తన సంచిలో దాచిపెట్టారు. ఈ విషయాన్ని ఆలయం ఈవో సీసీ టీవీ ఫుటేజ్‌లో గమనించారు. వెంటనే ప్రకాశ్‌ను నిలదీశారు. దీంతో చోరీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఇక ప్రకాశ్ నుంచి బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకుని ఆయన్ను పోలీసులకు అప్పగించారు.
Advertisement
Next Story