AP:పిన్నెల్లి అరెస్ట్ పై ఎట్టకేలకు స్పందించిన ఆ పార్టీ నేతలు?

by Jakkula Mamatha |   ( Updated:2024-06-28 12:12:50.0  )
AP:పిన్నెల్లి అరెస్ట్ పై ఎట్టకేలకు స్పందించిన ఆ పార్టీ నేతలు?
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి పిన్నెల్లి రామాకృష్ణారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు, మహిళాలపై బెదిరింపు చర్యలు వంటి కేసుల్లో ఆయనను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు వైసీపీ నేతలు పిన్నెల్లి అరెస్ట్ పై తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని కక్షపూరితంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మహేశ్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలో రాజకీయ దురుద్దేశ్యంతోనే పిన్నెల్లి పై అక్రమ కేసులు పెట్టారని వారివురు ఫైర్ అయ్యారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఆయనను ఓడించి వేధించాలనే దురుద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని ఆరోపించారు. అసలు ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో లోకేశ్‌కు ఎలా వచ్చిందని వారు ప్రశ్నించారు. ఈ కేసులో ఆయనకు స్టేషన్‌ బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో 307 సెక్షన్ పెట్టారని మండిపడ్డారు. దీనిపై న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు.

Advertisement

Next Story