- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM జగన్‌పై దాడివెనుక చంద్రబాబు.. రాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై జరిగిన దాడి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపిస్తుండగా.. మరికొందరు జగన్ వ్యూహాంలో భాగంగానే జరిగిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నాడని ఆరోపించారు. మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలుస్తామనే నమ్మకం లేక చంద్రబాబు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ బస్సు యాత్రను చూసి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులతో జగన్‌ను భయపెట్టాలనుకుంటే అది అమాయకత్వమే అవుతుందని అన్నారు. ఇకనైనా ఈ తరహా పాతకాలం రాజకీయాలను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. గతంలోనూ విజయవాడలో రంగా హత్యకు కారకులయ్యారని కీలక ఆరోపణలు చేశారు. తాము కూడా దాడులకు పాల్పడితే చంద్రబాబు, ఆయన టీమ్ రోడ్డుమీద తిరగుతారా? అని ప్రశ్నించారు. బస్సు యాత్ర, సిద్ధం సభలు కొనసాగుతాయని అన్నారు.