Breaking: చిరుతపులి కలకలం.. గుట్టల్లో రాళ్ల మధ్య సంచారం

by srinivas |   ( Updated:2024-04-04 14:15:40.0  )
Breaking: చిరుతపులి కలకలం.. గుట్టల్లో రాళ్ల మధ్య సంచారం
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది. మదనపల్లి మండలం, పాలెం కొండలో స్థానికులకు చిరుతపులి కనిపించింది. రాళ్ల మధ్య ఉండడాన్ని గుర్తించారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. చిరుతను వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. అయితే చిరుతపులి సంచారంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు తమ గ్రామంలోకి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తమతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, పశువులపై దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు.


అయితే విషయం తెలుసుకున్న అధికారులు చిరుతపులిని అటవీ శాఖ అధికారులు బంధించే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత పులి దాడి చేసే అవకాశం ఉండటంతో రాత్రి సమయంలో బయట తిరగొద్దని తెలిపారు. చిరుతపులిని బంధించేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

Advertisement

Next Story