- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా వ్యాఖ్యలు, పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పొత్తులు అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లనున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ చీఫ్ నడ్డాతో చర్చలు జరిపారు. అనంతరం అమిత్ షా సైతం ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ మిత్ర పక్షాన్ని విస్మరించలేదని తెలిపారు. తామను కాదని వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమని అంతా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అటు అమిత్ షా చేసిని వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ ఎదుగుదల కోసమే అమిత్ షా నిర్ణయాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. పొత్తులపై కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు. పార్టీ కోసం కార్యకర్తలందరూ పని చేస్తారని తెలిపారు. బీజేపీ అధినాయకత్వం తీసుకున్నఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి వెల్లడించారు.
Read More..
టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తాం : నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు