AP Liquor Policy:రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు తేదీ ఖరారు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-15 09:03:26.0  )
AP Liquor Policy:రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు తేదీ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీలో నూతన మద్యం పాలసీ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తేదీ ఖరారైంది. రేపటి నుంచి(అక్టోబర్ 16) నూతన మద్యం పాలసీ విధానం అమలులోకి రానుంది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్దతిని అవలంబించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed