- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మాజీ మంత్రి పెద్దిరెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు 12 మంది అనుచరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై దాడి చేసి, తప్పుడు కేసులు నమోదు చేశారని, మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన పెద్దిరెడ్డితో పాటు తంబల్లిపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా 12 మంది నోటీసులు జారీ చేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులపై రిపోర్టును సమర్పించాలని అన్నమయ్య ఎస్పీని సైతం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మాజీ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతికి పాల్పడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి కుటుంబాలపై దాడి చేశారు. గంజాయి, రౌడీ ముఠాలను ప్రేరేపించి దాడులకు పాల్పడ్డారు. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రెచ్చిపోయారు. పోలీసుల ద్వారా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. పెద్దిరెడ్డి దుర్మార్గపు చర్యలకు ఈ రోజు న్యాయం స్థానం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. పెద్దిరెడ్డి పతనానికి హైకోర్టు ఇచ్చిన నోటీసులు పునాదులు కాబోతున్నాయి. పెద్దిరెడ్డి చేసిన అఘాత్యాలకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర్లో ఉంది. ’’ అని హెచ్చరించారు.