‘కూలిన హెలికాప్టర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేటాయించిందే’..సీఎం భద్రతపై ఆందోళన

by Jakkula Mamatha |   ( Updated:2024-08-27 15:51:11.0  )
‘కూలిన హెలికాప్టర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేటాయించిందే’..సీఎం భద్రతపై ఆందోళన
X

దిశ,వెబ్‌డెస్క్:మహారాష్ట్రలోని పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం(ఆగస్టు 25) హెలికాప్టర్ కూలి ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ హెలికాప్టర్‌లో నలుగురు ఉండగా..అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. AW 139 అనే చాపర్ ముంబైలోని జుహు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తాజాగా ఈ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు కేటాయించిందని తేలింది. ఆయన కోసమే ముంబై నుంచి హెలికాప్టర్ హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో సీఎం భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే ఆ హెలికాప్టర్ 16 ఏళ్లనాటిదని, ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆ హెలికాప్టర్‌ను కొనసాగించడంపై పలవురు విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో జెడ్‌ప్లస్‌ కేటగిరి రక్షణ ఉన్న సీఎం చంద్రబాబు భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాలు, కాన్వాయ్‌ నుంచి హెలికాప్టర్‌ వరకు ప్రతిదీ పరిశీలించి, సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్‌ విషయంలో ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ సీఎం చంద్రబాబు ప్రయాణించే రెగ్యులర్‌ హెలికాప్టర్ కానప్పటీకి..స్టాండ్‌బై కోసం తెచ్చిన హెలికాప్టర్‌ కూలిపోవడంతో ఏవియేషన్‌ అధికారుల భద్రత చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హెలికాప్టర్‌ సామర్థ్యం, పనితీరు అంచనా వేయడంలో అధికారులకు నైపుణ్యం లేకపోవడంతో పాటు నిబంధనలు పాటించకపోవడమే కారణం అంటున్నారు. సరైన హెలికాప్టర్‌ను ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారని చెబుతున్నారు. వాస్తవానికి 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోరాదన్న నిబంధనలను పాటించలేదని విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed