రూ. 541 కోట్లకు తాగేశారు.. కొత్త మద్యం లెక్కలు చూస్తే మైండ్ బ్లోయింగ్

by srinivas |
రూ. 541 కోట్లకు తాగేశారు.. కొత్త మద్యం లెక్కలు చూస్తే మైండ్ బ్లోయింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మందు బాబులు పండుగ చేసుకుంటున్నారు. మూడు రోజులకే రూ. 541 కోట్ల మేర మద్యం అమ్ముడు పోయింది. 7 వేల 943 మంది వ్యాపారులు మద్యం స్టాక్ తీసుకెళ్లారు. మూడు రోజుల్లో లక్షా 94 వేల 261 బీర్ల అమ్మకాలు జరిగాయి. 6 లక్షల 77 వేల 511 కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది. జగన్ ప్రభుత్వంలో దొరికిన మద్యం బ్రాండ్లను రద్దు చేయడంతో పాటు పాత మద్యాన్నే అమ్మడంతో మందుబాబులు ఎగబడి మరి కొనుగోలు చేశారు. అటు బార్లలోనూ రూ.78 కోట్లు వ్యాపారం జరిగింది. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మకాలు జరుపుతున్నందున మద్యంబాబులు రోజులోనే మళ్లీ, మళ్లీ కొంటున్నారు. ఇలా మద్యంపై ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. కొత్త మద్యం పాలసీ వర్కౌట్ అయిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదే జోరు కొనసాగితే ప్రభుత్వ ఖజానాకు మరింత భారీగా ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.

Advertisement

Next Story