Amaravati: ఆ రోజు నుంచే అమరావతి నిర్మాణ పనులు

by srinivas |   ( Updated:2025-02-22 05:36:02.0  )
Amaravati: ఆ రోజు నుంచే అమరావతి నిర్మాణ పనులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati) నిర్మాణ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మార్చి 15 నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. మొత్తం రూ.40 వేల కోట్ల విలువైన 62 పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టనుంది. ఈ పనుల ప్రారంభం కోసం ఇప్పటికే సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లు(CRDA, ADC Tenders) పిలిచింది. మరో 11 పనులకు కూడా సీఆర్డీఏ అధికారులు(CRDA officials) త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Krishna-Guntur District Graduate MLC Election)ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ ప్రక్రియ ఎన్నికల అనంతరం కొనసాగించే అవకాశం ఉందని పలువురు అధికారులు అంటున్నారు. అయితే అమరావతిలో పనులకు అభ్యంతరం లేదని ఈసీ గతంలోనే పేర్కొంది. కానీ టెండర్లను మాత్రం ఎన్నికలయిన తర్వాత పూర్తి చేయాలని తెలిపింది.

Next Story

Most Viewed