- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
32వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె..చర్చలకు పిలుపునిచ్చిన ప్రభుత్వం
దిశ వెబ్ డెస్క్: తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడీ వర్కర్స్ అలానే హెల్పర్స్ సమ్మె చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సమ్మెను విరమించుకొని విధుల్లోకి రావాలని ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన అంగన్వాడీలు బెదరలేదు.. వెనకడుగు వేయలేదు. సడలిపోని సంకల్పముతో అంగన్వాడీలు సమ్మెను ముందుకు తీసుకువెళ్లారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్నతమ పట్ల ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణితో వ్యహరిస్తుందని అంగన్వాడి సంఘాలు మండిపడ్డాయి. విన్నూత రీతిలో ఆందోళనలు చేపట్టి అధికార ప్రభుత్వానికి పట్టపగలే చుక్కలు చూపించారు అంగన్వాడీలు.
ఈ నేపథ్యంలో అంగన్వాడీలతో మరొకసారి చర్చించేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు జరపనున్నారు. అయితే గర్భిణులకు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని కే.ఉషారాణి దాఖలు చేసిన పిల్ పై నిన్న హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన AG శ్రీరామ్ ప్రభుత్వం సమ్మెను వివరింపచేసేలా చర్యలు తీసుకుంటుందని.. త్వరలోనే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని.. అందుకు కాస్త గడువు కావాలని హైకోర్టును కోరారు.. అందుకు సమ్మతించిన ధర్మాసనం విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణ జరిపిన తరువాత అధికార ప్రభుత్వం అంగన్వాడీలను మరోసారి చర్చకు రమ్మని పిలుపునివ్వడం గమనార్హం.