- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యేలు చెప్పినట్లు కలెక్టర్లు వినడం ఏంటి?.. సీఎం నిర్ణయంపై మాజీ మంత్రి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొక్కుబడిగా జరిగిందని విమర్శించారు. టీడీపీ ఇచ్చిన హామీలను గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఉచిత ఇసుకలో ఉచితం మాయం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. హామీలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.7 లక్షల 48 వేల కోట్ల అప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు.
అసలు ఎమ్మెల్యేలు చెప్పినట్లు కలెక్టర్లు వినాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం అని అన్నారు. ఇది చాలా సిగ్గుచేటు అని అభిప్రాయపడ్డారు. ఇక నారా లోకేష్ చేతిలోని రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిందని విమర్శించారు. హత్యలు, అనైతిక కార్యక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ బొమ్మ ఉందని విద్యాదీవెన కిట్స్ కూడా పంపిణీ చెయ్యలేదని విమర్శించారు. అలాగే సంపద సృష్టిస్తానని.. ప్రజల సంపదను దోచుకుంటున్నాడని ఆరోపించారు.