- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు.. వివరాలు బయటపెట్టిన ఎన్నికల సంఘం
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అంతేకాదు ఆధారాలతో పాటు వివరాలు కూడా బయటపెట్టింది. జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఒకే డోర్ నెంబర్‌లో 10 ఓట్లకు పైగా దాదాపు లక్షా 57,939 ఇళ్లు ఉన్నాయని వెల్లడించింది.
కాగా రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదు అయ్యాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అంతేకాదు వైసీపీ నేతలే దొంగ ఓట్లను సృష్టించారని ఆందోళనను వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఎన్నికల సమయంలో ఈ విషయంలో తేటతెల్లమైందనిపేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పరిశీలన చేపట్టారు. దీంతో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. కొన్ని చోట్ల అధికారులపై కూడా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా అసలు దొంగ ఓట్ల పుట్టను ఎన్నికల సంఘం అధికారులు బద్దలు కొట్టారు.