- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Breaking: ఉత్కంఠభరితంగా ఆ నియోజకవర్గం.. టీడీపీ అభ్యర్థి ఎవరు..?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ అధినేతలు అధికారం చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంటే.. నేతలు పార్టీ టికెట్ చేజిక్కించుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇక వైసీపీ ఐప్యాక్ సర్వే ఆధారంగా అభ్యర్ధులను నియమించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మాత్రం అభ్యర్థుల నియామకంలో ఆచితూచి అడుగులేస్తోంది దీనితో అభ్యర్థుల నియామకం ఆలస్యమవుతోంది.
అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో హై టెన్షన్ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ నాకే వస్తుందంటే..కాదు నాకే ఇస్తారంటూ ఎవరికీ వారు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇక ఈ కోవలోకి నంద్యాల డోన్ నియోజకవర్గం కూడా వచ్చి చేరింది.
ప్రస్తుతం డోన్ నియోజకవర్గం టికెట్ ఎవరిని వరిస్తుందా అనే అంశం ఆ ప్రాంతంలో చర్చనీయాశంగా మారింది. డోన్ నియోజకవర్గం సీటు తనదే అంటూ ధర్మవరం సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కే.ఈ ప్రభాకర్ మాత్రం అంత సినిమాలేదు డోన్ నియోజకవర్గం తనదే అంటున్నారు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన పనిలేదు రోజుకో పేరును ప్రసతావిస్తోంది. దీనితో ఆశావహుల్లో టెన్షన్ రోజురోజుకి పెరిగిపోతోంది.
అయితే రెండు సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గం నుండి ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తారని బహిరంగంగా ప్రకటించారు. అయితే కే.ఈ ప్రభాకర్ దాన్ని భహిరంగంగానే వ్యతిరేకించారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అయితే తాజాగా ధర్మవరం సుబ్బారెడ్డి హైదరాబాద్ వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబును కలిసి మాట్లాడారు.
ఈ నేపథ్యంలో మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి అని టీడీపీ అధినేత సుబ్బారెడ్డికి సంకేతాలు ఇచ్చారని సమాచారం. దీనితో తమ నాయకుడే రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సుబ్బారెడ్డి అనుచరులు నియోజకవర్గంలో బాణాసంచాను కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.