- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మా పాప డెడ్ బాడీ కనిపెట్టండి’.. బాబు, పవన్‌లకు మృతురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్: మూడో తరగతి బాలికపై అదే స్కూల్ ఏడవ తరగతికి చెందిన ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో చోటు చేసుకుంది. అయితే, దారుణం జరిగి వారం రోజులు అవుతోన్న ఇప్పటికీ మృతురాలి డెడ్ బాడీ లభ్యం కాకపోవడం గమనార్హం. బాలికను హత్య చేసి మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశామని నిందితులు చెప్పడంతో పోలీసులు గజ ఈతగాళ్ల సహయంతో ఆ రిజర్వాయర్‌ను జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ బాలిక మృతదేహం దొరకకపోవడంతో మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు.
కూతురు చనిపోయిందని తెలిసిన వారం రోజులుగా కనీసం మృతదేహం లభ్యంకాకపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు కీలక విజ్ఞప్తి చేశారు. మా పాప మృతదేహం జాడ కనిపెట్టాలని.. మా బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.. మా పాప కనిపెట్టండని ఆవేదనతో వేడుకున్నారు. మరోవైపు పాప డెడ్ బాడీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు.