- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తాడేపల్లి ప్యాలెస్‌లోకి జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే: జగన్‌పై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లి ప్యాలెస్‌లోకి జనం చొచ్చుకెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జనసేన అధినేత వపన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్‌ను ఓటుతో సాగనంపాలని పిలుపునిచ్చారు. రైతుల పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్ బొమ్మలు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఆశయం కోసం వచ్చిన నాకు ఓటమి బాధ ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
పోయిన ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినా.. గుండె ధైర్యంతో తట్టుకుని ముందుకెళ్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనా కోసమే మళ్లీ జనంలో మధ్యకు వచ్చానని అన్నారు. తాను కేవలం ఓ కూలీ అని, కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయట్లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా 5 లోపు జీతాలు వేస్తామని తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు అండగా ఉంటామని తెలిపారు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తాం. కేవలం కులగణనే కాదు.. ప్రతిభను గణించి మహిళలను ప్రోత్సహిస్తామని అన్నారు.