కష్టాల చీకట్లు తొలగిపోవాలి..తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : నందమూరి బాలకృష్ణ

by Seetharam |   ( Updated:2023-11-12 07:20:44.0  )
కష్టాల చీకట్లు తొలగిపోవాలి..తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : నందమూరి బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల కష్టాలను తరిమేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.‘నరకాసురుని వధించి నరులందరి జీవితాలలో వెలుగును నింపిన మాతా సత్యభామ శౌర్యానికి..చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్టే.. దీపావళి పండుగ మీ కష్టాలను తరిమేయాలి,కష్టాల చీకట్లు తొలగిపోవాలి.. సంతోషాల వెలుగులు ప్రసరించాలి. ప్రకృతికి ఎక్కువ హాని చెయ్యకుండా పండుగ చేసుకుందాం. ఈ దీపావళికి వెలిగించే దీపాలు మీ జీవితాల్లో వెలుగులు నింపాలి’ అని నందమూరి బాలకృష్ణ కోరారు.

Advertisement

Next Story