- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు కోసం దేశం ఎదురుచూస్తోంది: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. బుధవారం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. స్కిల్ స్కాం కేసు నుంచి చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలి కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్లీ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొందన్నారు. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడో రేపో తీర్పు వెలువడనుంది అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పుకొచ్చారు. 17ఏ గురించి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌కు చట్టాలను ఉల్లంఘించడం వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని.. అవి ఫలించవని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు.