- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలోనికి రానుంది.. పంతం నానాజీ
కాకినాడ దిశ ఏప్రిల్ 13: కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
కాగా స్థానిక వైసీపీ నాయకులు గరగ పెదబాబు తన నుచరులు పార్టీకి రాజీనామాలు చేశారు. అనంతరం కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పండూరులో ఉన్న మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పండూరు చెరువు చుట్టుపక్కల గ్రామాలకి త్రాగు నీరు అందిస్తోంది, కానీ గ్రామానికి మంచినీరు లేకుండా పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు.
నీటిని డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉండడం చాలా దారుణం అని మండిపడ్డారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వర రావు, చప్పిడి వెంకటేశ్వర రావు, సీతయ్య దొర, దేవు వెంకన్న , బీజేపీ నాయకురాలు పితాని లీలా, స్థానిక జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.