- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:శాంతి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..వివరాల సేకరణలో కూటమి ప్రభుత్వం
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: దేవాదాయ శాఖలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద అధికారిని శాంతిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ లీడర్‌గా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె చేసిన వ్యవహారాల వివరాలను రాబడుతున్నారు. సహాయ కమిషనర్‌గా చిన్న ట్రంకు పెట్టెతో విశాఖ వచ్చిన ఆమె ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తులతో ఎలా వెళ్లిందన్న సమాచారం సేకరిస్తున్నారు.
100 కాసుల బంగారం..ఆలయానికి ఓ హారం
దేవాదాయ శాఖ సమీక్ష సమావేశంలో కేవలం తన వద్ద 100 కాసుల బంగారం ఉందని చెప్పుకునేందుకే వాచ్‌మెన్ కుమార్తె అయిన ఆమె తాపత్రయపడ్డారు. తాను దేవాదాయ శాఖ లోకి వచ్చిన తర్వాత సంపాదించింది కాదు.. పూర్వార్జితం అని చెప్పేందుకే ఈ నాటకం ఆడారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో అత్యంత అవినీతిపరుడు, కలెక్షన్ కింగ్‌గా పేరొందిన రాజు అనే ఇన్ స్పెక్టర్‌ను తన కుడి భుజంగా పెట్టుకొని దోపిడికి పాల్పడిన ఆమె ఒక్కో ఆలయానికి ఒక్కో రకం హారం, కాసుల పేరుతో వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. విశాఖ సాగర్ నగర్ లో 60 లక్షలతో ఇంటిని కూడా కొనుగోలు చేశారు.
ప్రేమ సమాజం భూములే విజయ సాయికి దగ్గర చేశాయి..
విశాఖ ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువచేసే భూములు ఆస్తులు ఉన్నాయి. వాటిపై విజయ సాయి రెడ్డి కన్ను పడింది. ఆ వివరాలు కావాలంటు దేవాదాయ శాఖను ఆదేశించగానే సహాయ కమిషనర్ హోదాలో ఆ ఫైలు పట్టుకుని విజయ సాయి వద్దకు వెళ్లిన శాంతి ఆయన చెప్పిన దాని కంటే వేగంగా పనులు పూర్తి చేసి బాగా దగ్గరయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయి ప్రియ రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకు సాయి రెడ్డితో కలిసి శాంతి పని చేశారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యంతో సాయి రెడ్డికి, మరోపక్క ఆయన వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌కు దగ్గరయ్యారు.
విజయ్ సాయి లైజనింగ్ ఆఫీసర్ శాంతి
శాంతి వ్యవహారాలు కేవలం దేవాదాయ శాఖకే పరిమితం కాలేదు. విశాఖలో, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా తమకు బదిలీ కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా శాంతిని కలిస్తే విజయ సాయి ద్వారా పనులవుతాయని నమ్మకం అప్పట్లో పెరిగింది. దాంతోనే ఎంతో మంది అధికారులు శాంతిని కలిసి మామూలు ఇచ్చుకొని తమ పనులు చేయించుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ లంకెలపాలెం పరదేశమ్మ అమ్మవారి ఆలయ స్థలంలో సర్వే నెంబర్ 109 లో రాయల్ లైన్ ఐస్ క్రీమ్స్ ఎల్ఎల్‌పీ పేరిట సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలకు మించి లీజు ఇవ్వడం కుదరదు. అయితే శాంతి నిబంధనలకు విరుద్ధంగా మొత్తం స్థలాన్ని ఆ సంస్థకు కట్టబెట్టారు. దీనిపై ఉన్నతాధికారుల అభ్యంతరాలు వ్యక్తం చేసిన లెక్కచేయకుండా దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
వదినతో దేశమంతా పర్యటన
ఆ భూ వ్యవహారంలో పరిచయమైన ఆడారి ఆనంద్ వదినను బుట్టలో వేసుకుని ఆమె డబ్బుతో శాంతి దేశమంతా విమానాల్లో తిరిగారు. దోష నివారణకు ఫలానా ఫలానా ఆలయాల్లో పూజలు చేయించాలని మాయ మాటలు చెప్పి దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలకు ఆమెతో కలిసి తిరిగి వచ్చారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ హోదాలో ఉన్న అధికారి జిల్లా విడిచి వెళ్లాలన్న , రాష్ట్రం విడిచి వెళ్లాలని ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. విజయసాయి అండ ఉందన్న ధీమాతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఎన్నోసార్లు దేశమంతా తిరిగి వచ్చారు.
వివరాలు రాబడుతున్న ప్రభుత్వం
శాంతి వ్యవహారాలు రచ్చకెక్కడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆమె గతంలో పనిచేసిన పోస్టులో జరిగిన అక్రమాలు, అవినీతి , అన్యాయాలపై వివరాలు రాబడుతోంది. ఆమె హయాంలో జరిగిన దేవాలయ భూముల లీజులు, అద్దె చెల్లింపులు, హుండీ ఆదాయంలో ఆరోపణలు వంటి వాటిపై వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే ఆమె సస్పెన్షన్‌లో ఉన్నారు. ఉల్లంఘనలు, అతిక్రమణలు భారీగా ఉంటే డిస్మిస్ చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.