చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్‌కు గ్రీన్ సిగ్నల్

by srinivas |   ( Updated:2025-03-17 12:20:36.0  )
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మిక కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మిక కుటుంబాలు 200 యూనిట్ల వరకూ, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. టీచర్స్ బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ రాజధానిలో భూకేటాయింపులకు సంబంధించి కేబినెట్ సభ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజీన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు మంత్రులు ఆమోదముద్ర వేశారు.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఉన్న వీవీఐటీయూకు ప్రైవేటు వర్సిటీ హోదా కల్పించారు. అనంతపురం సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయంలో ముగ్గురు కెమెరామెన్లు, వీడియో గ్రాఫర్ల పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రులు ఆమోదముద్ర వేశారు.

Next Story

Most Viewed