మద్యం పాలసీ రూపకల్పనపై.. కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ!

by Geesa Chandu |   ( Updated:2024-09-11 14:50:49.0  )
మద్యం పాలసీ రూపకల్పనపై.. కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం పాలసీ(Liquor policy) రూపకల్పనపై.. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ(cabinet sub committee)మొదటిసారి సమావేశాన్ని నిర్వహించింది. మద్యం విధానంపై అధ్యయనానికి ఇప్పటికే ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే తొలిసారి నిర్వహించిన ఈ సమావేశంలో.. మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవి పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం పాలసీనపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరుపుతుంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న మద్యం పాలసీని కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి.. బార్లు, మద్యం దుకాణాలు, బేవరేజెస్ కంపెనీల్లో అమలవుతున్న విధివిధానాలను మంత్రివర్గ ఉప సంఘం(Cabinet sub committee) పరిశీలిస్తోంది. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికపై సబ్ కమిటీ సమీక్షిస్తుంది. ఈ నెలాఖరుతో ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ముగియనుండగా.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనపై దృష్టి పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed