ఆ నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాక్..వైసీపీలోకి భారీ చేరికలు

by Jakkula Mamatha |
ఆ నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాక్..వైసీపీలోకి భారీ చేరికలు
X

దిశ,కడప:రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న బస్సు యాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కడప వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లి లో భారీ సంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.

ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఇక జిల్లాలో ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వైసీపీలో చేరుతున్నారు.పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం స్వాగతం పలుకుతుందన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా ప్రతి ఒక కార్యకర్తకు అండగా ఉంటమన్నారు. సతీష్ రెడ్డి కి పార్టీలో సముచిత స్థానం ఉందని ఆయన నాయకత్వంలో వేంపల్లి లో వైసీపీ మరింతగా బలపడుతుందన్నారు.

Next Story

Most Viewed