- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్మాది ఘాతుకం.... కూతురి వెంటపడొద్దన్న తండ్రిపై కత్తితో దాడి
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడు రెచ్చిపోయాడు. తన కూతురు వెంటపడొద్దన్న తండ్రిపై నలుగురు వ్యక్తులతో కలిసి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో బాలిక తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా మార్కాపురం పట్టణంలో ప్రేమ పేరుతో బాలికను యువకుడు వేధిస్తున్నారు.తనను ప్రేమించాలని లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. యువకుడి వేధింపులు ఎంతకీ తగ్గకపోవడంతో యువకుడి విషయాన్ని బాలిక తన తండ్రికి తెలిపారు. ఈ మేరకు యువకుడితో తండ్రి మాట్లాడారు. తన కూతురు వెంట పడొద్దని సూచించారు. దీంతో యువకుడు కక్ష గట్టారు. తన స్నేహితులతో కలిసి దాడి చేయాలని పథకం పన్నారు. ప్లాన్ ప్రకారం ఒంటరిగా ఉన్న బాలిక తండ్రిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.