FLASH: మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు కీలక తీర్పు

by Web Desk News |
ap high court
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ అంశంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప, వేరే వాటికి భూములు ఇవ్వొదని తెలిపింది. ఒప్పంద ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించింది. అంతేగాక, అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లో రైతులకు అప్పగించాలని తెలిపింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడంతో పాటు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర హైకోర్టుకు నివేదిక సమర్పించాలని పేర్కొంది. అంతేగాక, పిటిషన్ల ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.

Advertisement

Next Story