- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ రావు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు. తెలుగు మీడియా, చలన చిత్ర రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన రామోజీ రావు మృతి పట్ల పలవురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామోజీ రావు మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీ మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామోజీ మృతికి నివాళిగా ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, రామోజీరావు చేసిన సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు. అధికారికి లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.