- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగాల్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి.! ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లో జరిగిన జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి మరియు హత్య కేసును పట్టీ పట్టనట్లుగా చూస్తున్నారని, ఇది అస్సలు నార్మల్ విషయం కాదని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసుపై జరుగుతున్న దర్యాప్తును చూస్తుంటే.. చాలా బాధగా ఉందనీ, దీనికి కారకులైన వారిని వేగంగా దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, ఇలాంటి ఘటనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకురావాలని, మహిళా డాక్టర్ లకు తగిన భద్రత కలిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేసారు మాజీ మంత్రి శైలజానాథ్.