- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh : టెన్షన్ టెన్షన్: లోకేశ్ అరెస్ట్ తప్పదా?
దిశ , డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్ పాత్రపై సీఐడీ ఆధారాలు సేకరించే పనిలోపడిందా? సీఐడీ టార్గెట్ నారా లోకేశేనా? నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది లోకేశేనా? లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సీఐడీ దూకుడు పెంచిందా? 41 ఏ కింద లోకేశ్‌కు నోటీసులు ఇచ్చి అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఐడీ లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నారు. అనంతరం రెండు మూడు రోజుల్లో లేదా అక్టోబర్ 3 తర్వాత ఈ కేసులో లోకేశ్‌ను సీఐడీ అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఢిల్లీకి సీఐడీ
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణతోపాటు నారా లోకేశ్‌లు కీలకంగా వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు దాఖలు చేసిన మెమోలో లోకేశ్‌ను ఏ-14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తండ్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితి తనకు ఎదురవుతుందని భావించిన నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు సీఐడీ విచారణకు సహకరించాలని సైతం న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీ ఆదేశాలు సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ దూకుడు పెంచనుంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో లేదో అంతే సీఐడీ బృందం ఢిల్లీకి బయలు దేరేసింది. నారా లోకేశ్‌కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఉరుకులు పరుగుల మీద బయలుదేరింది. ఇప్పటికే ఢిల్లీలో ఒక బృందం మకాం వేసింది. దానికి తోడు తాజాగా ఆరుగురు సభ్యుల సీఐడీ బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ రోజు లోకేశ్‌కు సీఐడీ అధికారులు బృందం 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
తిరస్కరిస్తే అరెస్టే
హైకోర్టు ఆదేశాలతో నారా లోకేశ్‌కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను క్షణాల్లో పూర్తి చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో విచారణకు హాజరుకావాలని లోకేశ్‌కు సీఐడీ బృందం నోటీసులు ఇవ్వనుంది. అయితే ఈ నోటీసులను నారా లోకేశ్ స్వీకరిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నారా లోకేశ్ నోటీసులు తిరస్కరిస్తే అరెస్ట్ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు నారా లోకేశ్‌కు నోటీసులు ఇస్తారని ఒకవేళ తీసుకోకపోతే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికిస్తారనే ప్రచారం ఉంది. అనంతరం లోకేశ్ విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు తీసుకోవడంలో లోకేశ్ సక్రమంగా స్పందించకపోయినా..నోటీసులు తీసుకుని విచారణకు హాజరుకాకపోయినా లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసులు తీసుకున్నా విచారణకు హాజరుకాకపోతే అక్టోబర్ 3 తర్వాత లోకేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Nara Bhuvaneshwari : జైల్లో Chandrababu Naidu ను చూసి కంటతడిపెట్టిన భువనేశ్వరి