- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత.. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై రాళ్ల దాడి

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులకు గురైన బాధితులతో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ మిథన్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. రాళ్లు రువ్వారు. రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు.
Next Story