- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడుమూరులో ఉద్రిక్తత.. లోకేష్ పాదయాత్రను అడ్డుకునే యత్నం
దిశ, కర్నూలు ప్రతినిధి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కోడుమూరులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో అంపయ్య సర్కిల్‌లో ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్, దళిత సంఘాల నాయకులు, వైసీపీ కార్యకర్తలు లోకేష్ వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు, రిబ్బన్లు కట్టుకుని బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్ డౌన్‌డౌన్ అని, లోకేష్ దళితులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోడుమూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేసినా అడ్డుకుంటామని, ఆయన చెప్పిన విషయాల్లో ఏది వాస్తవం కాదని, ధైర్యం ఉంటే తమను ఎదుర్కొవాలంటూ ఎమ్మెల్యే సుధాకర్ సవాల్ విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను అరెస్ట్ చేసి నాగలాపురం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నారా లోకేష్ పాదయాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దళిత ద్రోహి జగన్ : లోకేష్
దళిత ద్రోహి సీఎం జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పన్నులు విపరీతంగా పెంచేశారని స్థానికులు లోకేష్ వద్ద వాపోయారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నామని యువకులు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు.
సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే విదేశీ విద్యా పథకం ప్రారంభిస్తామని, వైసీపీ నేతలు లాక్కున్న దళితుల భూములను తిరిగి ఇప్పిస్తామని ప్రకటించారు. దళితులకు భూమి కొని కేటాయిస్తామని హామిచ్చారు. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పై విమర్శనాస్ర్తాలు సంధించారు. ఇక్కడ ఎమ్మె్ల్యే సుధాకర్ కాదని, హర్షవర్ధన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏ పని చేయాలన్న హర్షవర్ధన్ చెప్పినట్లు చేయాల్సిందే తప్ప ఈయన పేరుకే ఎమ్మెల్యే అంటూ వ్యంగస్ర్తాలు సంధించారు.
అభివృద్ధి చూసి ఓర్వలేకే వ్యాఖ్యలు.. చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి
నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమ నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నారని, అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రతి రోజు తమ నాయకుడు జగన్ ను సైకో, పులకేసి, ఇలా రకరకాల పేర్లతో వ్యాఖ్యానిస్తూ అవమానపర్చడం ఏంటని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిపై ఇలా వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇలా వ్యవహరించి తన స్థాయిని దిగజార్చుకున్నారని, ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.