- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కారణం ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన నివాసంపై కొంత మంది యువకులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలో చాలా అరాచకాలకు పాల్పడ్డారని, ప్రశ్నిస్తే దాడుల చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే యువకులను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ కొంతసేపటికి యువకులు మళ్లీ భారీగా వల్లభనేని ఇంటి వద్దకు చేరుకున్నారు. వల్లభనేనికి దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలోనూ వల్లభనేనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కన్నుమిన్నుకానకుండా వల్లభనేని ప్రవర్తించారని, ఇప్పుటికైనా మారాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి వల్లభనేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో వల్లభనేని వంశీ పార్టీ మారారు. వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేనితో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు అక్కడున్న వాహనాల సైతం తగులబెట్టారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో వల్లభనేని వంశీ దారుణంగా వ్యవహరించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఘోరం అవమానించారు. నారా లోకేశ్ పుట్టకనే అవమానిస్తూ అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్థాపం చెందారు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా కంటతడి పెట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వల్లభనేని వంశీకి గన్నవరం ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయనపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ పరిణామాలతో వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆధరించిన జనాలే ఆ తర్వాత జరిగిన ఘటనలపై ఆగ్రహంతో బుద్ధి చెప్పడంతో వల్లభనేని వంశీ ముఖం చాటేశారని స్థానిక నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.