- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత: అనుచరుల ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో : డా.బి.ఆర్. అంబేద్కర్ కేనసీమ జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది. ఈ జిల్లాలో పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు టికెట్ లేదని సీఎం వైఎస్ జగన్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. సర్వేలలో ప్రతికూల ఫలితాలు రావడంతో టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు స్పష్టం చేశారు. వేరేవారికి టికెట్ ఇస్తామని అందుకు సహకరించాలని ఆదేశించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొండేటి చిట్టిబాబు కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే చిట్టిబాబు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయంలో సీఎం వైఎస్ జగన్ క్లియర్‌గా చెప్పారని.. కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారని అన్నారు. వైనాట్ 175 లక్ష్యంతో వెళ్తున్నాం కాబట్టి గెలిచేవారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ నేపథ్యంలోనే పి.గన్నవరం నుంచి కొత్తవారికి టికెట్ ఇస్తున్నట్లు అన్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పుకొచ్చారు.
జగన్ వెంటే నడుస్తా
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించిన ప్రతీ కార్యక్రమాన్ని శిరసా వహించి నెరవేర్చినట్లు ఎమ్మెల్యే చిట్టిబాబు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్వహించిన వారిలో తానొకరిని అని చెప్పుకొచ్చారు. వైసీపీ విధానాలను, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. అయితే సర్వేలలో తనకు నెగిటివ్ ఫలితాలు వచ్చాయని అందువల్లే టికెట్ ఇవ్వడం లేదని జగన్ తనతో అన్నట్లు తెలిపారు. ప్రజలు మాత్రం తనను కోరుకుంటున్నారని తనకే టికెట్ ఇస్తే మంచిదని అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే తనకు కాకుండా వేరొకరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. 2014,2019 ఎన్నికలలో వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ దయతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు వెల్లడించారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం వైఎస్ జగన్ వెంటే నడుస్తానని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్పష్టం చేశారు.
అనుచరుల ఆగ్రహం
వచ్చే ఎన్నికల్లో కొండేటి చిట్టిబాబుకు టికెట్ ఇవ్వడం లేదని తెలుసుకున్న అనుచరుల పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కొండేటి చిట్టిబాబుకి టికెట్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్స్ అంతా కొండేటి చిట్టిబాబుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొండేటి చిట్టిబాబుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.